Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

వ్యర్ధపదము లంతగా నుండవు; పదములకూర్పుమాత్రమేకాక యర్ధసందర్భమును మిక్కిలి పొందికగా నుండును. ఏ విషయము చెప్పినను యుక్తియుక్తముగాను, ప్రౌఢముగాను నుండును; ఎక్కడ నే విశేషణము లుంచి యే రీతి నే పదములు ప్రయోగించి రసము పుట్టింపవలయునో యీకవికి దెలిసినట్లు మఱి యొకరికి తెలియదు. ఈయన కవిత్వము లోకోక్తులతోఁ గూడి జాతీయముగా నుండును; ఈయన పదలాలిత్యమును, యుక్తిబాహు ళ్యమును, అర్ధగౌరవమును, రచనాచమత్కృతియు, శయ్యావిశేషమును, సందర్భశుద్దియు, కల్పనాకౌశలమును, అన్యులకు రావు. ఈ కవిశిఖామణి యొక్క కవిత్వమునం దొకవంతు సంస్కృతపదములును. రెండువంతులు తెలుఁగు పదములు సుండును. ఇటీవలి యాంధ్రకపులు కొందఱు తాము రచియించెడివి తెలుఁగు పుస్తకములన్నమాట మఱచియో తమ పాండిత్యమును కనబఱుపవలెననియో తమ గ్రంధములను సాంస్కృతికదీర్ఘ సమా సములతోను, కఠినములయిన సంస్కృతపదములతోను నింపివేసిరి. నన్నయభట్టువలెనే యీ కవియుఁ దన గ్రంధమును మూలమునకు సరిగాఁ దెనిఁగింపలేదు. విరాటపర్వమునందు మాత్రము కధ తగ్గింపక కొంత పెంచినను, తక్కిన పర్వములయందు కధను మిక్కిలి సంగ్రహపఱిచెను. ఉద్యోగపర్వము నందలి సనత్కుమారోపదేశమును మూలములో పది పండ్రెండు పత్రములున్నదానిని తెనుఁగున రెండు మూడు పద్యములతో సరి పెట్టెను; భగవద్గీతలు, ఉత్తరగీతలు, మొదలయిన వానిని తెలిఁగింపనే లేదు. భగవద్గీతలు తెలిఁగింపలేదనుట సరిగాదనియు, కొన్ని పద్యములలో దానిని సంగ్రహపఱిచెననియు, విమర్శకు లొకరు వ్రాయుచున్నారు. పదునెనిమిదధ్యాయముల మహాగ్రంధములో

శ్లో|| "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
      మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ "

అను ప్రధమ శ్లోకమును