పుట:Aandhrakavula-charitramu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

1201-వ సంవత్సరమునకు 1260-వ సంవత్సరమునకును నడిమివిగా నున్నవి. తిక్కనసోమయాజి తన ప్రభుని కార్యమునిమిత్తమై గణపతిదేవుని యాస్థానమునకుఁ బోయియుండుట నిర్వివాదాంశ మగుటచేత నాతఁడు 1200 లకును 1260 కును మధ్య నెప్పుడో యోరుగంటికిఁ బోయి యుండవలెను. 1253,1260 సంవత్సరములకు మధ్యపోయినట్లు కనఁబడుచున్నది. ఈ కాలమునం దుండిన తిక్కనసోమయాజి యింతకుఁ బూర్వమునం దిన్నూఱు సంవత్సరముల క్రిందట నుండిన నన్నయభట్టారకునితో సమకాలికుఁడని సాధించుట యే తర్కముచేతను సాధ్యము కానేరదు. దాన శాసనాదులవలె నంత విశ్వాసార్ధములైనవి కాకపోయినను, కాకతీయ వంశమునుగూర్చి యిటీవలివారు వ్రాసిన గ్రంథములను బట్టి చూచినను దిక్కనసోమయాజి నన్నయభట్టు కాలమునం దున్నట్టు చూపుట యసాధ్యమే! సర్వప్పచేత రచియింపఁబడిన ద్విపద సిద్దేశ్వరచరిత్రములోను, మల్లపరాజ పుత్రుఁడైన వీరనార్యునిచే రచియింపఁబడిన ప్రతాపచరిత్రములోను, జగ్గకవికృతమైన సోమదేవరాజీయములోను, కాకతిప్రళయుఁ డోరుగంటి కోటను గట్టి రాజధానిని ఆనమకొండనుండి యోరుగంటికి శాలివాహన శకము 990 కి సరియైన క్రీస్తుశకము 1068-వ సంవత్సరమునందు మార్చుకొన్న ట్లైకకంఠ్యముతోఁ జెప్పCబడి యున్నది. ఈ విషయమునుగూర్చిన సోమదేవరాజీయములోని పద్యము నిందుదాహరించుచున్నాను.-

         సీ. "అవనిపై శాలివాహనశకాబ్దంబులు
                      తొమ్మిదినూఱుల తొంబదియగు
              వరశుభకృన్నామవత్సరంబునను గా
                      ర్తికశుక్లపంచమితిథిని దివిజ
              గురువాసరంబునఁ గర మొప్పురోహిణీ
                      నక్షత్రమున నా ఘనప్రభుండు
              మానుగా నేకశిలానగరంబుఁ గ
                      ట్టించె నెంతేనియు ఠీవి మెఱయ