మంత్రి భాస్కరుఁడు
మంత్రి భాస్కరుఁడు సుప్రసిద్దుఁడను, కవిబ్రహ్మయునగు తిక్క-న సోమయాజి పితామహుఁడు. తిక్కన యీతనిని తన నిర్వచనోత్తర రామాయణమునందు 'నాపితామహుఁడగు మంత్రి భాస్కరునిcబట్టియే నాకృతికి ఆదరము కలుగు'నని ప్రశంసించియున్నాఁడు. తిక్కనకు "దశకుమార చరిత్రము నంకిత మొసఁగిన కేతన యీ మంత్రి భాస్కరుని -
'శాపానుగ్రహ శక్తియుక్తుడమలా
చారుండు, సాహిత్య వి
ద్యాపారీణుఁడు ధర్మమార్గపధికుం
దర్థార్థి లోకావన
వ్యాపారవ్రతు డంచుఁ జెప్పు సుజన
వ్రాతంబు గౌరీపతి
శ్రీపాద ప్రవణాంతరంగు విబుధ
శ్రేయస్కరున్ భాస్కరున్'
అని కొనియాడియున్నాఁడు మంత్రి భాస్క_రుఁడు క్రీ. శ. 1190-1220 నడువ నుండిన వాఁడు
ఇప్పడు 'భాస్కర రామాయణ' మని ప్రచారమున నున్న గ్రంధములోని అరణ్యకాండ మీతఁడు రచించినదై, తాళపత్రప్రతుల పరిశీలనమువలన బాల, అయోధ్యాకాండలను గూడ నీతఁడే రచియించి యుండవలెనని చెప్పవచ్చును. కాండముల చివఱి గద్యలు, అరణ్యకాండమందలి ఆశ్వాసవిభాగము, రచనావైలక్షణ్యము. ఇట్టి యూహ కాధారములు. మంత్రి భాస్కరుఁడు రచించిన కాండముల చివఱి పద్యములు విభక్త్యంతములతో నుండఁగా, తక్కినవి సంబోధనాంతములై యున్నవి. ప్రక్షిప్తములు ఎక్కువగా చేరినవి.