Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

85

న న్న య భ ట్టు

   గీ. పొల్పుగాc దీరమున శుచిర్భూతయైన
       యతనిసుందరి పుష్పిణియై ప్రియుండు
       వినిన నే మనునో యని ప్రేమ దక్కి
       పిలిచినను బల్కకుండెను బ్రియనితోడ. 37

వ. ఆది యెఱుంగక యా రాజు సమీపంబునకు వచ్చి పోదము లెమ్మన్న నేను పుష్పవతినై తినని సదరహసితభయంబుగఁ బలికిన విని గుండె జల్లన ధరిత్రీపతి రాజ్యంబుపరుఁ లాక్రమించుటకు సమయంబయ్యె నిక్కడ నాల్గు దినంబులునికికి హేతువయ్యెగదా యని చింతించుచున్న యతనిం జూచిఁ యక్కడ నుండెడు బ్రాహ్మణు లిట్లవిరి. 38

     గీ. నీదు భార్య పుష్పిణియైన నిత్యదోష
        మెల్లఁ బరిహార మొనరించి మేము శీఘ్ర
        ముగను బరిశుద్దఁ జేసెద మొగిని మాకు
        నేమి యొస(గంగఁ గలవాఁడ వీవు చెపుము

39

వ. అనిన మీర లీ దివసంబున నన్ను నా కాంతతోఁ గూడఁ పురంబు బ్రవేశింపఁ జేసితిరేని మీకు నా రాజ్యంబులో నర్ధంబు నొసంగి యుండం జేసెదనన విని వారలు నట్ల కాక యని యమ్మహాస్థలంబున నదీతీరంబున నుండెడు చాముండికయును నద్దేవాలయంబున నుండెడు నర్జున మాలూర వృక్షంబులును సాక్షులని ధర్మంబుగాఁ బలికి వారలు రాజకాంతను గంగాతీరంబున గూర్చుండ నియమించి చతుర్వేదంబుల యందలి మహామంత్రంబులు పఠియించి తద్భామిని కుదకంబు దేహంబున బ్రోక్షించి స్నానంబు లొనరించి యీ మంత్రంబునఁ బరిశుద్దంజేయ శుద్ధియైన యత్తన్వి నతనికిం జూపిఁ తోడ్కొని పురంబునకు జనుమునిన నతండుసంతుష్టాంతరంగుండై మునుపు వచ్చినయట్ల నిజపత్ని తోడఁ పురంబు ప్రవేశంబై నాఁటినుండియు నిది మోసం బని గంగాస్నానంబు విసర్జించి తచ్చింతాంతరంగ మగ్నుండయి యుండెఁ గొన్ని సంవత్సరంబు లరగిన గాశియందు దుర్భిక్షంబు వచ్చిన