పుట:Aandhrakavula-charitramu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

బ్రాహ్మణులకన్న వస్త్రంబులు లేక కఠినదినంబు లొదవినఁ బూర్వంబున నందవరంబున నుండి నందచక్రవర్తి యసు విశ్వంభరేశ్వరుండువచ్చి చిక్కుపడి యిచ్చిన మాట దలంచి తద్బామాదోషనివారకులైన వారి లార్వేలే నూటికి నా దేశంబునకుఁ బోద మా భూమీశం డర్ణరాజ్యంబు నొసంగం గలవాఁడని యన్యోనంబుగా ననుకొని యమ్మహాస్థలంబు వెడలి కతిపయదినంబులకుఁ జేరవచ్చి యతనికిఁ దమరాక యెఱింగించిన నతండు విని దీనికి సాక్షులం దోడ్కొని రావలయుననిన వారలు "దురాత్మా ! చాముండికాసమీపంబున నీ వాడిన మాట లేదనిన నమ్మహాశక్తి యధర్మంబు పల్కునే తోడి తెచ్చెదము తదనంతరంభం యర్థదేశం బివిత్తువుగాక" యని కోపంబున మగిడిపోయి రందుఁ గొందఱు విప్రులు మనముపోవుట యెట్లు : తచ్చ క్తి వచ్చుట యేలాగున మే మార్వేలవార మీ దేశంబుననె యుండెదము మా యదృష్టం బుండునట్లు కాగలదని మగిడి వచ్చి దక్షిణ దేశంబున వృత్తులు నుద్యోగంబులు ననుసరణ పూర్వకంబుగా సంపాదించు కొనిరి తక్కిన యేనూఱు గురు విప్రులం నభిమానంబునఁ బోయి కాశి బ్రవేశించి చాముండికా సమీపంబున బహు తపం బొనర్చిన నద్దేవి కరుణించి వరం బొసంగెద వేఁడు డనిన వారలు దుష్టాత్మకుండైన రాజు పూర్వంబున నీ ముందట నిచ్చిన మాట మాకొసంగడయ్యె నట్లు గావున నీవు స్వస్వరూపంబున వచ్చి మా కర్థరాజ్యం బొసగునట్లుగా జేయవలయుననిన నేను బహుదినంబుల నుండి యీ పుణ్యన్లలంబున వసియించుదాన నెట్ల రావలతునని చింతించి మీ పెూర తపంబునకు మెచ్చితి నింకేమి చేయుదునైనఁ బోదము లెం డనవుడు వార లమ్మహాశక్తినింద్ర ద్రుబిల్వ వృక్షసహితంబుగా దోడ్కొని వచ్చి నంద పుపరంబునకు నర్ధక్రోశంబున నిల్పిన నా శక్తి యా దుష్టుని దోడ్కొని రమ్మనిన వారలు వచ్చి 'పాపాత్మా శక్తి నిన్ను రమ్మని నియమించె, నీ గ్రామసమీపంబునకు వచ్చిన దనిన విని సంతసిల్లి యతి త్వరతోడ వచ్చి యా దేవికి సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి.