పుట:Aandhrakavula-charitramu.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

వ. నీవు పుణ్యాత్ముండ వగుటంజేసి నీకు రేపటినుండి వారణాసియందు ................ చేకూరఁగలది యని యభిమంత్రించి..................నీ వర్ధ రాత్రంబున మేల్క_ని యాచమనంబుచేసిదృఢభక్తి నొక్కసారి యీ మంత్రంబు పఠియించి గంగాతీరంబునఁ బుణ్యస్టలంబున నుండవలయు మంత్రాధి దైవతంబా ! ......జేర్చి నేత్రంబులు మోడ్చి క్షణమాత్ర ధ్యానంబుచేసి నమస్కరించి ముహూర్తమాత్రంబునకు గన్నులు విచ్చి చూచిననంత గాశి యందు నీ మనస్సంకేతిత పుణ్యస్థలంబునందుఁ బ్రవేశంబై యమ్మ హాగంగా ప్రవాహినియందు సుస్నాతుండవై యచ్చటి వేదవేదాంగ శాస్త్రపురాణపారంగతు లయిన భూసురోత్తముల కనేక స్వర్ణముద్రిక లొసంగి వారలచే నాశీ ర్వచనంబులఁ పుచ్పుకొని మగడ నీ పురంబునకు వచ్చి నిత్యం బీరీతి నొకండవె పోయి వచ్చుచు సకల ధర్మంబు లాచరించుచు విప్రోత్తములకు షోడశ దానంబులు చేయుచుఁ పుణ్యాత్ముండమై యుండు, మిందుల కనృతంబు రాదీ వాక్యంబమోఘం బని యవి యొసంగి యతండు తిరోహితుండయ్యె నంతట ౩౦

మ. అతc డాశ్చర్యముతోడ దారుమయమౌ నప్పాదు కాద్వంద్వ మా
    తతభక్తిం గయికొంచుఁ బూర్వకృత విస్తార ప్రపుణ్యంబు నం
    చితమై కన్పడురీతి నీతఁడెవడో సిద్దేంద్రుఁ డత్యంత స
    మ్మతితో న న్గరుణించి యిచ్చె నవి నమ్మన్వచ్చుఁ జిత్తంబులోన్

వ. అని మనంబున వితర్కించుకొనియే నీ మేటిమంత్రంబు పఠియించిన నిదర్శనంబు గనిపించెనేని సులభంబున గంగాస్నాన ఫలంబు లభియించు నని విచారం బొనర్చుకొనియస్నయంతమధ్యాహ్నంబున గగనమధ్యంబున దినమణి ప్రకాశమానుండయ్యె నట్టియెడ సమీప స్థితులైనవారలు దేవా ! స్నానంబునకు వేంచేయవలయునని విన్నవించిన లేచి సకల సామంత కవి గాయకాది సభాస్థితులై న వారలను గృహcబులకుఁ బొండని యనుజ్ఞ యొసంగి తానును గృహాంతరంబునకు వచ్చి జలంబులాడి ధౌతవస్త్రధరుండై