Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83

న న్న య భ ట్టు

వేఱొక సద్మంబున నూర్డ్వ పుండ్రాలం కృతుడై మధ్యాహ్న విహిత సంధ్యాతర్పణాదికాలోచితకృత్యంబులునిర్వర్తించి ................నేఁగిపత్నీకరపచనంబై న షడ్రసోపేతంబై_న ............. బారగించి లేచి ప్రక్షాలిత గదనకర పదుండై ... యొక్క విహిత స్థలంబున గూర్చుండి జాంబూ .......... యావికాసినాగ వల్లిదళంబును మౌక్తిక చూర్ణ ...........తాంబూలంబు మెసవిముహూర్తంబు వామభాగంబున శయిని ................నిద్రించి మగుడి లేచి యాస్థానమండపంబున గూర్చుండి ఇష్టాలాపంబున బ్రొద్దు పుచ్చుచున్న యెడ నీ రాజు రాక నెఱింగించి ..... వేగఁ గాశికింబోయి ...... వాసులకు యేగెనో యనఁ బ్రద్యోతను దస్తగిరి శిఖరంబున నంతర్ధానంబునొందె, సంధ్యారాగా క్రాంత విచిత్రంబైన గగనంబునందు నక్షత్రంబులు గననయ్యె;నంత పూర్వదిక్భాగంబున నుదితుండయ్యె. ధాత్రీవుండు కొలువు చాలించి సదనంబునకేగి భోజనంబు చేసి యొప్పు డెప్పుడని తిమురుచు శయ్యపై బవళించి భార్య పాదఘట్టనం బొనర్ప నీషన్నిద్రాభరంబన మేల్కాంచిదిగ్గనలేచి ప్రభాతం బయ్యనోయని తలంచి బహిరంగణంబులకువచ్చి నక్షత్రదర్శనంబు సేసి ప్రహర త్రయంబగుట నికాయంబునకుం బోయి నిష్కాది ద్రవ్యం బనేకంబు గ్రహించి యా సిద్ధోక్త ప్రకారంబుగా నాచమనీయం బొనర్చి యర్థ నిమీలితలోచనుండై తన్మంత్రపఠనం బొనర్చిన విశ్వేశ్వర మాధవడుండిదండపాణి భైరవ విరాజితంబైన వారణాసిం జేరి తద్గంగాతీరంబున సూర్యోదయం బగుటయు మదీయ పూర్వపుణ్యఫలంబని యత్యంతాశ్చర్యంబునొంది కృతస్నానుండై సంధ్యాద్య నుష్ణానంబులు నిర్వర్తించి తత్తీరస్థితులైన మేదినీ నిర్జరులకు బహుసువర్ణ ముద్రిక లొసంగి వారివలన అశీర్వచనంబులు గైకొని మగుడి యొక్క రహస్య స్థలంబునకు వచ్చి పావలు మెట్టి కన్నులు మొగిడ్చి మంత్రపఠనం బొనర్చి తన పురంబునకు వచ్చి యధాప్రకారంబున నొరులకు దేటపడకుండ వర్తింపుచు నిట్లు బహుదినంబులు సంతోషంబున నుండె నొక్క దినంబున స్నానప్రయాణంబు చేయుచున్న పతిం జూచి,