పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెనుమచ్చ బుచ్చిరాజు.


ఈకవి పరతత్త్వప్రకాశిక యనెడి యెనిమిదాశ్వాసముల వేదాంతగ్రంథమును రచియించెను. ఇతడు క్షత్రియుడు; ధనంజయ గోత్రుడు; వేంకటపతిరాజకుమారుడు. ఈకవి తాను కర్లపాలెము గ్రామనివాసు డయినట్టును, సూర్యవంశపు రాజయినట్టును వ్రాసికొనియున్నాడు. భాగవతములోని కపిల దేవహూతి సంవాదమాధారముగా నీగ్రంథముపెంచి వ్రాయబడినది. ఇతడు తొంబదిసంవత్సరములు జీవించి కొన్నియేండ్లక్రిందటనే కాలధర్మమునొందినట్లు తెలియవచ్చు చున్నది.



మండపాక పార్వతీశ్వరకవి.


ఈవిద్వత్కవి శతకములు మొదలైనవి యెనుబదిగ్రంథములవఱకును రచియించినను ఈయనచే రచియింపబడి ముద్రింపబడియున్న గ్రంథములలో శ్రీరాధాకృష్ణ సంవాదమను నాలుగాశ్వాసముల ప్రబంధము ప్రధానమైనదిగానున్నది. ఈయన వైదికబ్రాహ్మణుడు; పారాశరగోత్రుడు; కామేశ్వరపండితపుత్రుడు. ఈకవియొక్క తండ్రితాతలుకూడ కవీశ్వరు లయినట్టు రాధాకృష్ణసంవాదమునందు కవి యీక్రిందిపద్యమున జెప్పియున్నాడు--