పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రోసనూరి వేంకటపతి.

ఈకవి విష్ణుమాయావిలాస మను మూడాశ్వాసముల పద్యకావ్యమును రచియించి దానిని వేంకటగిరిసంస్థాన ప్రభువయిన శ్రీ వెలుగోటి బంగరు యాచమనాయని కంకితము చేసెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు; లింగనామాత్యుని పౌత్రుడు; గంగనమంత్రి పుత్రుడు; కాశ్యపగోత్రుడు. కృతిపతి తండ్రియైన కుమారయాచ భూపాలుడు తనకు "తిక్కయవ్వ" యను బిరుదము నిచ్చినటు కవి యీపద్యమున జెప్పుకొన్నాడు -