పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సముఖ వేంకట కృష్ణప్పనాయకుడు

ఈకవి యహల్యాసంక్రదన మను మూడాశ్వాసముల ప్రబంధమును రచించెను. ఇతడు శూద్రకులజుడు; సముఖ మీనాక్షినాయకుని తనుజుడు. "శ్రీమత్పాండ్య మండలాధీశ్వర విజయరంగ చొక్కనాధ మహీనాథ కరుణాకటాక్ష సంపాదిత గజతురంగ మాందోళికా చ్ఛత్రచామరవిజయ దోహళకాహళభూరి భేరీ బిరుదధ్వజ ప్రముఖ నిఖిలసంపత్పారంపరీ సమేత " అని ఆశ్వాసాంత గద్యమునందు జెప్పుకొనుటచేత కవి మధురాధినాథు డయిన విజయరంగ చొక్కనాథుని కాలములో నున్నవా డగుట స్పష్టము. ఈ విజయరంగ చొక్కనాథుడు క్రీస్తుశకము ----వ సంవత్సరము మొదలుకొని ---- వ సంవత్సరము వరకును పాండ్యమండలాధీశ్వరుడుగా నుండెను. కాబట్టి కవియు ---- సంవత్సర ప్రాంతములనుండి యున్నవాడే. ఇతడు జైమిని భారతమును వచనకావ్యముగా రచించిన ట్లహల్యాసంక్రందనములోని యీక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది -