పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంగర నృసింహకవి.


ఇతడు రాజరాజాభిషేక మనునైదాశ్వాసముల ప్రబంధమును రచియించి కొప్పుల వల్లభూవరున కంకితము చేసెను. ఈకవి రామకృష్ణభట్టారకుని కుమారుడు. ఈకవి యేకాలపువాడో నిశ్చయముగా దెలియరాలేదాఉ. ఇత డల్లసాని పెద్దనాదులను బేర్కొనక శ్రీనాథునివఱకును గలకవులనుమాత్రమే కవిస్తుతిలో జెప్పియుండుట చేతను మధ్యకవులుమాత్రమే పేర్కొన్న చిమ్మపూడి యమరేశ్వరుని సంస్తుతించి యుండుటచేతను నృసింహకవి మధ్యకవులలోనివా డేమోయని సందేహము కలుగుచున్నది.