పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశమును మహాంధ్రదేశమని బిలచెదరని చెప్పియున్నాడు. ఒకప్పుడు మహాంధ్రదేశమునకు ధాన్యకటకము రాజధానియై యుండెను, గాని యు ఆన్ చ్వాంగ్ వ్రాతలబట్టి జూడ నేడవ శతాబ్దాదిని విజయవాడ రాజధానిగ నుండినట్లు దోచెడివి[1]. అదియునుగాక ధాన్యకటక దేశము చాళుక్య రాజ్యములో జేరియుండక వేరు రాజ్యముగ నుండెనేమో తెలియరాదు. అట్లున్నట్లు, ఇంతవఱకు శాసన ప్రమాణము గానవచ్చుటలేదు. యువాన్‌చ్వాంగ్ వ్రాసిన దానిని బట్టి యాతడు ధరణికోటను గాని అమరావతీస్తూపమందుగాని గాంచి యుండలేదనియు, నాతడు వర్ణించిన రాజధాని విజయవాడ యనియు నిర్ణయింపవచ్చును. ఆతడు చెప్పిన వర్ణనలన్నియు చక్కగా విజయవాడకు సరిపోవుచున్న వనియు, ధరణికోటకు సరిపోవుటలేదనియు, నీప్రాంతమునంతయు సూక్ష్మముగా బరిశీలించిన రాబర్టు నూయలు, జేమ్సుబర్గెన్, బాన్వెలుదొరల యభిప్రాయము యదార్థముగ గన్పట్టుచున్నది[2]. మరియు యు ఆన్ చ్వాంగ్ ఆరుమాసము లిక్కడనుండి ప్రతియంశమును, గుహను, దేవాలయమును సొరంగమును ప్రత్యక్షముగ చూచిన వాడగుటచే, నాతడు వ్రాసినదానిలో నేమియు తప్పుగాని, పొరబాటునుగాని గన్పట్టుటలేదు. ఈకారణమువలన, యు ఆన్ చ్వాంగ్ వర్ణించిన ధనకటక దేశపు రాజధాని విజయ

  1. Archaeological Survey of South India. P. 9. Fi.
  2. J.R.S. 1173.q 263 J.R.A.S. Vol. XIIp 98 ff.