పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాటిక యనియే నిశ్చయింపవలయును. బౌద్ధోపాసకులు విజయవాడ, సీతానగరము, ఉండవల్లి, గుహలందు నివాసము చేయుచుండిన కాలమున అక్కడి సంఘారామములన్నియు రాత్రివేళబారులు దీర్చిన దీపములతో కనులపండువ సేయుచు మనోహరముగ నుండెనుగాబోలు!

యు ఆన్ చ్వాంగ్ ధాన్యకటక దేశమునందలి బౌద్ధసన్యాసులు మహాసాంఘిక శాఖకు జెందినవారని చెప్పుచున్నాడు. మరియు నీతడిచ్చటి భిక్షవులకడ అభిధర్మ పీఠికను అభ్యసించి తిరిగి వారికి మహాయన మార్గమును బోధించెననిగూడ దెలియుచున్నది.

యుఆన్‌ చ్వాంగ్ వర్ణించిన పూర్వశైల సంఘారామము అపరశైల సంఘారామమును బెజవాడనగరమున కిరుప్రక్కలగల కొండలపై యుండునట్లు గాన్పించెడిని. శిథిలములయిన కట్టడములు, గుహలు, మొదలగునవి యీ యూహనుబలపఱచుచున్నవి. భావవివేకస్వామి అపరశైలమున, హృదయధారణిని జపించి, అవలోకితేశ్వరుని బ్రత్యక్షముచేసుకొని యుండెనట. ఆయవలోకితేశ్వడీకాలమునాటి మల్లేశ్వరుడగునేమో? మన యాత్రికుని వర్ణనలపరీక్షించి విజయవాడ యందలి అపరశైల, పూర్వశైల సంఘారామములు రెండును ఒక్కటే మఠమని నిరూపించుచున్నట్లు తోచును. అపరశైలము కనకదుర్గ దేవాలయమున్న కొండ. దానిపై నేటికి ననేకగుహలు, కట్టడములు ప్రాచీనకట్టడముల చిహ్నములు గానవచ్చుచున్నవి.