పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములుగలవు. కాని, యవియన్నియు చాలభాగము భిక్షుక శూన్యము లయి, శిధిలములయియున్నవి. ఇపుడు, మంచి స్థితి యందున్న విరువది మాత్ర ముండును, వానియందు దాదాపు వేయిమంది సన్యాసులున్నారు. వీరందరు "మహాసాంఘిక" శాఖకు జెంది, అభిధర్మపిటకము నభ్యసించువారుగా నున్నారు. బ్రాహ్మణ దేవాలయములు నీదేశమున నూఱు వఱకు గలవు. అన్యమతస్థులగువారు గూడ నీదేవాలయములందు బూజలొనర్తురు.

ఈ దేశపు రాజధానికి తూర్పువైపున నొకకొండపై 'పూర్వశైల సంఘారామ మను యొక మఠముగలదు. నగరమునకు పడమట దిశనంటి యున్న మరియొకకొండపై 'అపరశైలసంఘారామ' మను నింకొక మఠము గలదు. బుద్ధునిప్రీతి కొఱకు పూర్వపు రాజొకడు ఈమఠములను కొండలదొలిపించి కట్టించెను. ముందుగా నాతడు కొండను లోయగాదొలిపించి మార్గము నేర్పఱచెను. పిదప నామార్గమున కిరుప్రక్కలను గుహల దొలిపించి విశాలమయిన మందిరములను చావళ్ళను నిర్మింప చేసెను. ఈపర్వతము నావహించియుండు దేవతలీ సంఘారామములను భద్రముగా జూచుచుండెను. పూర్వము మహర్షులనేకు లిచ్చటికేతెంచి కొంతకాలము నివసించి తిరిగి పోవుచుండిరి. బుద్ధుడు నిర్వాణము నొందినతరువాత వేయి సంవత్సరములవఱకు బౌద్ధులు (శ్రామణులు) ఇచ్చట కేతెంచి వర్షకాలమిందు గడపి అర్హతులై ఆకాశమున ఎగిరి స్వదేశ