పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముల కేగుచుండువారు. అట్లు ఒక వేయిసంవత్సరములు వఱకు బౌద్ధులు బౌద్ధసన్యాసులు కలిసి యిచ్చట నివసించుచుండిరి. కడచిన నూఱు సంవత్సరములునుండి మాత్రము పూర్వమువలె బిక్షువులు వచ్చుటలేదు. ఆకారణమున పర్వతదేవతలు క్రూర మృగముల యాకృతిగొని యొకప్పుడు కోతివలెను మరి యొకప్పుడు తోడేలువలెను బౌద్ధులకు గానుపించి ఈసంఘారామములకు బాధాకరు లగుచుండుటచే సన్యాసులు వచ్చుట మానివేసిరి. ఇపుడీ దేశము చాలవఱకు నిర్జనమై భయంకరముగా నున్నది.

"ఈ నగరమునకు దక్షిణమున నొక కొండకు పెద్ద సొరంగము గలదు. అందొక అసురుని హర్మ్యముగలదు. ఆహర్మ్యమునందు, శాస్త్రజ్ఞుడగు భావ వివేకస్వామి మైత్రేయబోధిసత్త్వుడు, సుగతుడై యవతరించు నందాక ధ్యాన సమాధి యందుండి వేచియున్నాడు. మహాతపశ్శాలి యనియు, జ్ఞానియనియు, సర్వశాస్త్ర పారంగతుడనియు భావవివేకుడు చాల ప్రఖ్యాతి నొందెను. బాహ్య వేషముచేత నీతడు కపిలుని సాంఖ్యశాస్త్రవాదివలె గన్పట్టినను, హృదయమందు మాత్రము నాగార్జునుని మహాయన సంప్రదాయము నవలంబించి యుండెను."

"పూర్వము భావవివేకుడు మగధదేశమున నివసించుచు తన మహిమచే వేలకొలది జనులకు బౌద్ధ మతావలంబకులుగా జేయుచున్న ధర్మపాలుని పాండిత్యమును గూర్చి విని,