పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథములం దతడు నాసికాపుటములగుండ నీరు త్రాగుట మొదలయిన యోగరహస్యముల సహాయమున, కొన్ని వందల సంవత్సరములు జీవించియుండెనని చెప్పబడి యున్నది. ఈతడు చిరకాల జీవియనుటలో సందియము గానరాదు గాని, పాశ్చాత్యులు కొందఱు దీనిని విశ్వసింపక, నాతని జీవితకాలము మహాయన సంప్రదాయ మభివృద్ధిలో నుండిన యైదాఱు శతాబ్దముల కాలమే బౌద్ధులచే మహాయన మార్గమును బోధించిన నాగార్జునునకు జీవిత కాలమని అతిశయోక్తిగా చెప్పియున్నారని వ్రాయుచున్నారు. ఈతడు రసవాదశాస్త్రజ్ఞడనియు, ఱాళ్ళను కరగించి బంగారముచేసెనన్న గాధయు చీనా తిబెతు గ్రంథములందు గానవచ్చుచున్నది.

నాగార్జునుడు చరిత్ర ప్రసిద్ధుడయ్యును, మనకు మిథ్యాపురుషుడును కల్పిత మహావ్యక్తియువలె గన్పట్టును. బౌద్ధమతముయొక్క యుచ్చదశయం దీతడు అద్భుతమైనట్టియు, దుర్గ్రాహ్యమైనట్టియు వ్యక్తివలె ప్రకాశించుచున్నాడు. పాలీసంస్కృత వాఙ్మయములం దీతడు మహామేథావియు సర్వజ్ఞునివలె గన్పట్టును. ఇత డన్యమతములపట్ల నిరుపమానమైన సహనము జూపిన మహనీయుడు. బోధిసత్త్వుడై మతప్రచారము గావించిన మహావీరుడు.


Watter Yuanchwang, Vol, II p, 204