పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాతత్వవేత్త, కవీశ్వరుడు, వాఖ్యాత, రసవాది, శాస్త్రజ్ఞుడు, దయాసముద్రుడు, బోథిసత్త్వులు బుద్ధులగుటకు బొందవలసిన దశ భూమికలలో, దుర్ఘటమైనట్టి ప్రథమ భూమికను బొందిన వాడగుటవలన నీతడు "ఏకోభూమీశ్వరు"డని బేర్కొనబడుచుండెను. ఈతని కీర్తి దిగంతవిశ్రాంతమై యుండినను, ఈతని జన్మస్థాన మెద్దియో, నెప్పుడు జన్మించెనో, యెపుడు నిర్యాణము చెందెనో, యాతని జీవిత మెట్లు, ఎచ్చ టెచ్చట గడసెనో దెలిసికొనుట కాధారములు గాన్పింపవు. కొంద ఱీతని జన్మస్థానము పశ్చిమదేశమని యూహింతురు గాని, యించుమించుగా దక్షిణ కోసలదేశ మీయన జన్మభూమి యని దోచుచున్నది. తిబెతు గ్రంథములం దీతడు చిరకాలము నాలందా సంఘారామమున బౌద్దవిద్యల నభ్యసించెనని దెలుపబడియున్నది. ఈతడు జన్మించిన ప్రాంతమాంధ్రభూమి నియు నితడాంధ్రుడనియు చాలామంది యభిప్రాయ పడుచున్నారు. ఈతడు బుద్ధుని నిర్యాణానంతరము, 200 సంవత్సరముల కని కొందఱును 500 సంవత్సరములకని కొందఱును, 400 సంవత్సరములకని కొందఱును, జీవించియుండెనని నిర్ణయించుచున్నారు. బౌద్ధుల ప్రథానగురుపరంపరలో నీతడు 13 వ లేక 14 వ ఆచార్యుడుగ బేర్కొనబడుచు క్రీ. పూ 212 వ సంవత్సరమున మరణించెనని చెప్పబడి యున్నాడు.[1] ఈత డించు

  1. Asiatic Researches Vol. II p. 409.