పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుమారునికైవడి బెంపబడుచుండెనని దోచుచున్నది. కావున రుద్రాంబిక, పరిపాలించిన రాజ్యమామె పితృకరాజ్యము. గణపాంబిక పాలించినది భర్తయొక్క రాజ్యము. మార్కోపోలో యీ నారీమణి భర్తరాజ్యమునే పాలించుచుండినట్లు చెప్పినాడుగావున, నాతడు ప్రశంసించినది గణపాంబిక గాని రుద్రాంబిక గాజాలదని నిశ్చయింపవచ్చును. మరియు నొంకొక విశేషముగలదు. గణపాంబిక రుద్రమదేవికి సామంత రాజ్ఞియై యుండి కప్పము గట్టుచుండ వచ్చునుగాని యామె చిన్న రాజ్యమున నామె సర్వస్వతంత్రులుగా నుండెను. అట్టియెడ, నీమె రాజ్యమున రుద్రాంబికపేరు వినబడినదనుటకంటె గణపాంబికదేవికీర్తియే గానము చేయబడు చుండెననుట సమంజసముగా నుండును.

ఇంచుమించుగా, రుద్రమదేవియు, గణపాంబయునొకే కాలమున పరిపాలనము సాగించియుండిరిగాని, రుద్రమదేవి కంటె గణపాంబయే అటుపదిసంవత్సరములు నిటుపదిసంవత్సరములును వెరసి యరువది సంవత్సరముల వరకు తిండ్రిగణపతి దేవునివలె పరిపాలించి యుండినట్లు గానవచ్చుచున్నది. గణపాంబ ఎటుచూచినను రుద్రమ దేవి పరిపాలనము మూడుదశల కంటెమించలేదు. గణపాంబ భర్త మరణాంతరము యనేకధర్మ కార్యముల నాచరించెను. ధాన్యకటకము లోని యమరేశ్వరాలయము యొక్క గోపురమునకీమె బంగారు కలశమును నిర్మించెను. తనభర్తపేరిట బేతేశ్వరాలయమని యొక శివాలయమును బ్రతిష్ట