పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేసెను. బేతేశ్వరాలయ గోపురములకు గూడ సువర్ణ కలశములెత్తించెను. ఈశివాలయ సంరక్షణముకొఱకు ధాన్యసమృద్ధమైన బెనదేవియను గ్రామమున దేవమాన్యముగ ధారవోసి, శాసనము వ్రాయించెను. బ్రాహ్మణులకనేక అగ్రహారములు దానము చేసెను. మరియు దనతండ్రి గణపతి దేవచక్రవర్తి పేరిట గణణేశ్వరాలయమును శివాలయమును బ్రతిష్టించి దానికై చింతపాడను గ్రామమును దానముచేసెను. ఈమె, మహేశ్వరధ్యానతత్పరురాలై, యవసానకాలమును గడపెను.