పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణపాంబ గారగపాడు గ్రామములోని కొంతభూమిని, నూనె తీయుటకొక గానుగను, ఒకపువ్వుల తోటను దానము చేసెనని చెప్పబడియున్నది. ఇది యిట్టులుండ నాయూరనే వేణుగోపాలస్వామివారి యాలయముననున్న యొక శాసనమున, గణపాంబ, శా. శ. 1172 నాటికే (క్రీ. శ. 1250) భర్త చనిపోయినందున షట్సహస్ర విషయమును తానే స్వయముగా పాలించుచుండినట్లు చెప్పుకొన్నది.[1] ఈ రెండుశాసనములును పరీక్షించిచూచిన కోటబేతరాజు 1250 వ సంవత్సరమునందుగాని, 1251 సంవత్సరమునందుగాని మరణించియున్నట్లు తోచకమానదు.

పైశాసనాథారములబట్టి, బేతరాజు, గణపతిదేవుడిక పదిసంవత్సరములకు మరణించుననగా, కాలధర్మమునొందినట్లు నిర్ణయింపవచ్చును. బేతరాజు మృతుడైనది మొదలుకొని గణపాంబ భర్తృ రాజ్యమును తానే పరిపాలించినట్లు, యామె వేయించిన యనమదల శాసనములవలనను, అమరావతి శాసనములబట్టియు తెలియుచున్నది. బేతరాజు చిన్నతనమునందే, గణపతిదేవునికి సహాయముగ యుద్ధములందు పోరాడుచు క్రీ. శ. 1251 సంవత్సరమున మరణించియుండవచ్చును. ఇతనివెనుక గణపాంబామహాదేవి చాలాకాలము ఆఱువేలనాటిని పరిపాలించియుండెను. బేతరాజు చనిపోయినవెనుక, నతని సోదరుడైన, కోటమన్మకేత రాజపుత్రులయిన, గణపతి దేవరా

  1. Ep coll 142 of 1913