పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వసింపవచ్చును. తనమేనల్లునకింతటి విపత్తు సంభవించుట చేతను బందుత్వము చెడిపోవకుండుట గణపతి దేవుడు రుద్రదేవరాజు కుమారుడైన బేతరాజునకు తనకూతురు గణపాంబనిచ్చి వివాహముజేసియుండెను. రుద్రదేవునకు మేనమామ కుమార్తె యైన గణపాంబ బేతరాజునకు పెండ్లియాడ వరుసయెట్లయ్యెనో యెఱుకపడదు. అయిన నాకాలపు సాంఘికాచారములు గాని రాజనీతిగాని, మనకు దెలియ నంతవఱకు, నిట్టి వివాహములు రాజ్యసంరక్షణమునకై రాజనీతి ననుసరించి గావింపబడుచుండిన ట్లూహింపవలయును.

బేతరాజు రాజ్యపరిపాల నారంభ సంవత్సర మెపుడో తెలియరాదు గాని, యాతడు మరణించినది మాత్రము శా.శ. 1173 (క్రీ. శ. 1251) సంవత్సరమని తెలియవచ్చుచున్నది. [1]బేతరాజు శాసన మొకటి యాతడు శా.శ. 1173 సంవత్సరమునాటికింకను జీవించియున్నట్లు సూచించుచున్నది. ఆశాసనము శకవర్షము 1173 (క్రీ. శ. 1251) వైశాఖశుద్ధ విదియా సోమవారమునాడు వ్రాయించబడినది. అందు కోటబేతరాజు, (మహిషాసురమర్దనగిరి) యనుమదలనుండి రాజ్యమేలు చుండినట్లును, ఆతడా పట్టణమున గోపీనాధుడనుపేర కృష్ణుని కొక దేవాలయము కట్టించగా, ఆదేవుని అంగరంగవైభవములకు, నిత్యపళ్ళకు, దీపారాధనముల కొఱకు నాతని రాణి

  1. Ep and Vol. III pp 95-96 Ep coll for 1833 Ep no 120 to 123