పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పియున్నాడు. మొత్తముమీద నాతని గ్రంథమంతయు మనోజ్ఞముగ నుండును. భూగోళవిషయములు, శాస్త్రవిషయముల, నౌకాయానములు, మొదలగు శాస్త్రసంబంధమైన వృత్తాంతములతో నిండియున్నను, పదమూడవ శతాబ్దమునాటి వృత్తాంతములు, మార్కో జూచినవింతలు, చాలవఱకు అవిశ్వసనీయములుగ గన్పట్టుచు, చిత్రవిత్రములయిన కధలతో నిండియుండినకతని, చదువునపుడు మిక్కిలి మనోహరమై ఎప్పటికప్పుడు ముందునకుబోవ కుతూహలము కలిగించుచుండును. వేయేల! ఆతని గ్రంథమునం దొక విషయముండి, మరియొకటిలేదని చెప్పవలనుపడదు.

మార్కోపోలో గ్రంథమును సంపాదించి, సంస్కరించి తొలుత ప్రకటించినవాడు ఇటాలియా వాస్తవ్యుడైన రిమూషియో. ఇతడు పదియేనవ శతాబ్దమందు జీవించియుండెను. ఆతడు ప్రచురించిన ప్రతిని బురస్కరించుకొని పగా సుదేశీయ డగు మూసాపాధియగు పగా సుభాషలోనికి భాషాంతరముచేసెను. ఈరెండిటిని ఉపయోగించుకొని మార్సెడను 1818 వ సంవత్సరమున నాంగ్లాను వాదమును బ్రచురించెను. మార్సెడనుగారి గ్రంథము చాలప్రశస్తమైనది. దాని తరువాత, మార్కోపోలో తిరిగిన దేశము లన్నింటినిగూర్చి విశేషముగ శ్రమకోర్చి యెన్నియో నూతనాంశములను సంపాదించి, గ్రంథమునంతయు, మరల నింకొకమారు సంస్కరించి, ప్రాచీన మూలప్రతినిబట్టి ఆంగ్లభాషలోనికి భాషాంతరీ