పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరణము గావించి సవ్యాఖ్యానముగ సర్ హెన్రీయూలు ప్రకటించినాడు. యూలుగారి ప్రచురణము వ్యాపించినతరువాత మార్సెడనుగారి గ్రంథమునకు వ్యాప్తము తగ్గిపోయెను. ఇపుడీవృత్తాంతమును, యూలుగారి గ్రంథమును ప్రధానముగా మందిడుకొని రచించితిమి.

కుబ్లయి ఖానుని కొలువులోనున్నపుడు, దూరస్థితి రాజ్యములను బాలించు మహామండలేశ్వరుల రాజరిక మెట్లుండెనో యారసివచ్చుటకును, లోపము లున్నయెడల సవరించివచ్చుటకును మన మార్కో నియమింపబడినట్లు ఈవఱకే తెలిపియుంటిమి. ఈ నియోగమందున్న కాలమున నాతనికి తఱచుగా దూరదేశ ప్రయాణములు తటస్థించుచుండెను. ఆ కాలమున నొకసారి, దక్షిణ చీనారాజ్యములను సందర్శించుటకేతెంచినపుడు, వినోదార్థమై, దక్షిణహిందూమహాసముద్రము నంతయు ప్రయాణముచేసి దీవుల నన్నింటిని చూచివచ్చెను. ఆ కాలమునందే సింహళద్వీపమును, మాబారు దేశమని మహమ్మదీయ చరిత్రకారులచే బిలువబడుచుండిన పాండ్య, చోళ దేశములను ఆంధ్రభూమినికూడ చూడవచ్చెను.

ఈతడు దక్షిణహిందూస్థానమున కరుదెంచిన సంవత్సరమును సరిగా నిరూపింపజాలముగాని, యించుమించుగా 1290 వ సంవత్సరమని యూహింపవచ్చును. అప్పటికి చోళులప్రతిభ సన్నగిలిపోయెను. వారి రాజ్యము, స్వాతంత్ర్యము గూడ, నంతరించెను. దక్షిణమున పాండ్యులు, పశ్చిమ