పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుఖముగా జేరునప్పటికి వారికొక సంవత్సరము బట్టెను.

క్రీ.శ. 1295 సంవత్సరమున వెనీషీయానగరమున, మనయాత్రికులరాక, యొకవింతగా నెల్లరకు దోచెను. ఎన్నడో మృతులయిరని, దాయాదులెల్లరును, పోలో కుటుంబముయొక్క, సొత్తునంతయు నాక్రమించుకొనిరి. ఇంటినికూడ తమ వశముచేసికొని యందు నివసించుచుండిరి. తార్తారులవలె నసహ్యకరములయిన యుడుపులను ధరించివచ్చిన వారి నెవ్వరును తమవారినిగా నిరూపింపలేక పోయిరి. కాని, వారు తమ భాగ్యమును బ్రకటించి, విందులిచ్చి, బంధువుల నెల్లరను రావించి గౌరవించినపుడును, చీకిచినిగిపోవుచు నసహ్యకరములయిన వారి యుడుపులను ముక్కముక్కలుగా, కత్తిరించి, అందుగల మడతలలోనుండి యమూల్యములయిన రత్నములను, మణులను ముత్యములను కుప్పలుగా ద్రిమ్మరించినపుడును, ఎల్లరును వారివృత్తాంతమును విశ్వసించియుండిరి. పదునేడు సంవత్సరములు దేశాంతర్గతులయి యుండుటచేత వారిభాషయుకూడ పోల్చశక్యము గాకుండెను.

పెద్దవాడగు మాఫియో పెండ్లి యాడకయే ముదుసలి యయ్యెను. పెండ్లియాడిన నికోలో, భార్య మరణించెను. జీవితకాల మంతయు ప్రవాసమున గడిపిన, మార్కో మహదైశ్వర్యమున కంతకు నపుడు యజమానియయ్యెను. ఇకనాతడు పరిణయమాడి సుఖింపదలచెను. అప్పటి కాతనికి నలువది రెండు సంవత్సరములు వయసుండెను. అతని సంకల్పమెట్లున్నను దైవమను