పుట:Aananda-Mathamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ఆనందమఠము


సిపాయీలను కొట్టిచంపి తరిమివేసి, బండ్ల మీఁదనున్న ఇరసాలు రూపాయలను స్వాధీనము చేసికొనిరి. చావక మిగిలియున్న సిపాయీలు భగ్నోత్సాహులై పరాభూతులై పలాయనులైరి.

మొదట బండిమీద నిలిచి తర్వాత యుద్ధమున యాజమాన్యమును వహించినయతఁడు భవానందునియొద్దకు వచ్చెను. ఇర్వురును పరస్పర మాలింగనము చేసికొనిరి. అపుడు భవానందుఁడు, 'జీవానందా ! యత్నించిన కార్యము సఫలమైనది* ఆనెను.

జీవానందుఁడు, 'భవానందా! నీ నామము సార్థకమగును గాత,' అని యాశీర్వదించెను. అపహృతధనమును యథాస్థానమునకుఁ గొనిపోవుటకు జీవానందుఁడు నియమింపఁబడఁగా, 'నతఁడు తనయనుచరులతోడ స్థానాంతరమునకు బయలుదేణి పోయెను. భవానందుఁ డొక్కడే యుండెను.


తొమ్మిదవ ప్రకరణము

మహేంద్రుఁడు తప్పించుకొనుట

మహేంద్రుఁడు బండినుండి దిగి ఒక సిపాయి చేతిలోనికత్తిని లాఁగికొని యుద్ధములోఁ దానును చేరవలయునని యెంచెను. అయినను, వీరు దొంగలు, ధనాపహరణార్థమై సిపాయీలను గొట్టుచున్నారని తెలిసికొని, యుద్ధ స్థానమునకుఁ గొంచెము దూరమున నిలిచెను, ఏలన, దొంగలకు సహాయము చేసినచో వారు చేయుపాపములకు భాగి కావలసివచ్చు నని యెఱింగి