పుట:Aananda-Mathamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవప్రకరణము

37


హవల్ దారును చంపినాఁ డని చెప్పుచుపోయి వాని చేతిని పట్టుకొనఁబోయెను. వాస్తవముగా వానిచేత తుపాకి యుండెను. సిపాయి దగ్గఱింపఁగానే, మూటను క్రిందపడవైచి, ఆతుపాకిని త్రిప్పుకోని ఒక్క దెబ్బ వానితలమీఁద వేసెను. వానితల ఆదేబ్బకుపగిలిపోయెను. ఆ సమయమున “హరీ,హరీ” యని కూయుచు ఇన్నూఱుగురు శస్త్ర ధారులు వచ్చి సిపాయీలను ముట్టడించిరి సిపాయీలు అధికారియాగమనమును నిరీక్షించుచుండిరి. ఆయధికారివచ్చి లై౯ ఫారం (To form the line) చేయుటకు కమా నిచ్చిరి. ఇంగ్లీషువారికి విపత్కాలమున నిషా తల కెక్కి యున్నసు చింత లేదు. సిపాయీలు నాలుగుదిక్కులలోను చతుష్కోణవ్యూహాకారముగా నిల్చిరి. మరల అధికారి కమా౯ చెప్పినట్లుగా తుపాకులను సరిగా చేతపట్టుకొనిరి. ఇంతలో నెవఁడో యొకఁడు, అధికారి కమ్మర్ బందులోనున్న కత్తిని తీసి కొని కండ్లుమూసి తెఱచునంతలో అధికారి మస్తకమును ఛేదించెను, ఈ అధికారితల ఆతఁ డెక్కియున్న గుఱ్ఱము కాళ్ల క్రిందపడి యున్నందున, పైర్ (Fire) చేయునట్లు ఆజ్ఞ నిచ్చుటకు వేఱేతల లేకపోయెను. అప్పుడొకఁడు బండిమీఁద నిలుచుకోని కత్తిని చేతపట్టీకొని త్రిప్పుచు. 'హరీ, హరి' యని యఱచుచు సిపాయీలను కొట్టుఁడు, నఱుకుఁడు' అని గడబిడ చేయుచుండెను, వీఁడే భవానందుఁడు.

హఠాత్తుగా అధికారి ఛిన్న శిరస్కుఁడై నదానిని గాంచి ముందేమి చేయుటకును ఉత్తరు విచ్చువారు లేక, సిపాయీలు ఏమియు తోఁపక నిశ్చేష్టితులై కొంచెము సేపు భయముచేఁ గుంది నిలిచి యుండిరి. అంతలో దైర్యశాలులైన దొంగలు,