నలుబదినాలుగవ ప్రకరణము
227
చేయుచుండినవి; ఏవి? నక్కలు, కుక్కలు, గద్దలు, ఇవిగాక ఆ హతులైన జనుల క్షణికమైన ఆర్తనాదము. కొందఱు ఛిన్నహస్తులు; కొందఱు ఛిన్నమస్తకులు; కొందఱకు కాళ్లు భగ్నములై యుండెను; కొందఱకు శరీరము చిల్లులుపడి పోయెను; కొందఱు గుఱ్ఱముల క్రిందఁ బడి యుండిరి; కొందఱు అమ్మా! యనుచుండిరి; కొందఱు అయ్యా! యని యఱచుచుండిరి; కొందఱు దాహము అనుచుండిరి; కొందఱు మూలుగుచుండిరి. బంగాళీలు, తురకలు, ఇంగ్లీషువారు, హిందూస్థానీలు, తెలగాలు, అఱవలు, అందఱు నేకత్ర జడజడితమై మృతులైరి. ఆమాఘమాసపు పూర్ణిమా రాత్రి యందు ఆ దారుణమైన శీతమున వెలుఁగుచుండు వెన్నెలయందు రణభూమి అతిభయంకరమై కానఁబడుచుండెను. అచ్చటికిఁ బోవుట కెవ్వరికిని ధైర్యము లేదు.
ఎవ్వరును ధైర్యము చేసి పోలేదు. అయినను, ఆ యర్ధరాత్రి సమయంబున నొక రమణీమణి ఆ యగమ్యమైన రణక్షేత్రంబున తిరుగుచుండెను. ఒక మషాలును వెలిఁగించుకొని దాని వెల్తురున నేమో వెదకుచుండెను. ప్రతిశవము యొక్క ముఖమును ఆవెల్తురులోఁ జూచుచుండెను. ఎచ్చటనైనను శవము గుఱ్ఱము క్రింద పడి యుండినచో, నాయువతీమణి చేతిలోనున్న వెల్తురుకట్టెను దిగువ నుంచి, గుఱ్ఱమును రెండు చేతులతో లాగివేసి ఆ శవమును పరీక్షించి చూచును. ఈరీతిగా వెదకుచు నారణ క్షేత్రము నంతయుఁదిరిగెను. వెదకుచుండిన శవ మెక్కడను దొరక లేదు. అప్పుడు వెల్తురును బాఱవైచి యాశవరాశి పూర్ణమైన రక్తమయభూమిపైఁ బడి యేడ్చుచు పొరలాడు