పుట:ASHOKUDU.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

అ శో కుఁ డు

జీవితదుర్ధినమున-ఘ నాంధ కారమున మహాత్ముఁడగు నుప గుప్తుని యుపదేశదీపకాంతిచే కాత్మైకశుద్ధ మార్గమును గ్రహింపఁగలిగెను. ఆనిర్భాగ్యురా లిఁక నామార్గమును విడువ లేదు. అప్పటి నుండియు నామె ధర్మపథమును బట్టి పోయి తుదకమృతసదనమును జేరుకొనఁగలిగెను. ధర్మము నకును ధార్మికులకును గలమహీమ యిట్టిదియే.


ఇరువది మూడవ ప్రకరణము


పుణ్యస్మృతి

భౌద్ధధర్మమందిరమున గాలివానయడఁగిన తరువాత మహారాజగు నశోకుఁడు భౌద్ధ క్షేత్రముల నన్నింటిని దర్శింపవలయు నని యుత్సాహము కలవాఁడయ్యెను. భగవానుఁడగు బుద్ధదేవుని పాదరజోలేశముచే నేస్థలములు పవిత్రములైనవో శ్రీమంతుఁడగు నాతని చితాభస్మమే త్రిలోక పవిత్రమైనదని ఏ పుణ్యతీర్థములయందు భావింపబడుచుండెనో, యా సర్వ తీర్థములను గూఁడ దాను స్వయముగఁ బోయి దర్శింపవలయునని యాఁతడు వేడుక పడుచుండెను. ఆ పావన క్షేత్రముల యందుఁ దా నొనరించు " ధర్మసంస్థాపనముల పుణ్య స్మృతి చిర కాలమువఱకు జాగరిత మగుచుండవలయునని యాతఁ డిచ్ఛయించుచుండెను. ఇంతవఱక నేక కారణములచే

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/96&oldid=334888" నుండి వెలికితీశారు