పుట:ASHOKUDU.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము

89.

నాతనికోరిక నెఱవేఱినది కాదు. ఇప్పుడు శుభసమయము తటస్థించినది. ఇక నాలస్యము చేయరాదని మహారాజు నిశ్చయించుకొనెను.

బౌద్ధేతిహాసవిదుండును, బహుశ్రుతుండును, ధర్మాచార్యుండు నగు నుపగు ప్తుఁడు మహా రాజునకుఁ బవిత్రక్షేత్రముల ప్రాచీన చరిత్రమును బోధించియుండెను. ఉపగు ప్తుఁడాపుణ్య క్షేత్రముల నన్నిటిని స్వయముగ నిదినఱకే చూచి యుండెను. అందుచేతనే యాతఁ డా మహా రాజునకు సకల పుణ్య క్షేత్రమహిమలను యథారీతిగ మనోహరముగ బోధింప గలిగెను. మహాత్ముఁడగు నుపగు ప్తుని స్వభావ వర్ణ నావశమున నా పుణ్య క్షేత్రములన్ని యు నా మహా రాజునకు మనోనయన గోచరము లై యుండెను. అప్పుడు మహా రాజు తీర్థ యాత్రార్థము సంపూర్ణ ప్రయత్నుఁ డయ్యెను.

నిర్దిష్ట శుభదినమున మహా రాజగు నశోకుఁడును మహత్ముఁడగు నుపగుప్తుఁడును దీర్థయాత్రకు బయలు వెడలిరి. పాటలీపుత్ర పరిసర వాహినియగు భాగీరథిందాఁటి వారిరువురును వైశాలిని నగరమునకుఁ బ్రయాణము చేసిరి. ఆ వై శాలినీనగరము పాటలీపుత్రమున కీశాన్యమున ముప్పది మైళ్ళ దూరమునం దుండెను. బౌద్దేశిహాసమునందు వై శాలినీ నగరము సుప్రసిద్ధ మైనది. ఒక సమయమునందు బుద్ధ దేవుఁడీ నగరమును దర్శించి మిగులఁ బ్రశంసించి యుండెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/97&oldid=334890" నుండి వెలికితీశారు