పుట:ASHOKUDU.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63

పదునెనిమిదవ ప్రకరణము

ఆ బాలయోగిగాన రూపబోధనమువలన నామహారాజు హృదయమున మఱపునఁబడిపోయిన యెన్ని యోసంగతులు స్మృతికి వచ్చుచుండెను. అతని ప్రాణములు చేతనారహితము లై పోయెను. అప్పుడేమి చేయవలయునో యాతని కేమియుఁ దోచుట లేదు. బాలకుఁడు మర లమరలఁ బాడఁదొడంగెను—— " లెమ్ము ! ఆలసుఁడవై యుండఁబోకుము. ధర్మాచరణముం గావింపుము-ధర్మాచరణుఁ డిహలోకము నందును బరలోకమునందునుగూడ సుఖియింపగలడు. సత్కర్మములను జేయుము ! అసత్కర్మములను జేయవలదు, ధర్మచారియగువాఁ డిహపరలోకములయందు యుండఁగలఁడు."

మహా రాజగునశోకుని హృదయమునందుఁ గింకర్త వ్యతావి మూఢత్వము వదలిపోయినది. ఆతని హృదయము నుండి సందేహాంధ కారచ్ఛాయయుఁ బ్రదీపాంధకార చ్ఛాయయునుగూడ సశించిపోయినవి. అతఁడు తన జీవితమును బౌద్దధర్మ ప్రచారమునం దే గడపవలయు నని నిశ్చయించుకొన్న సంధిసమయ మిదియే.


పదునెనిమిదవ ప్రకరణము

నవజీవనము

“ ప్రాణములను రక్షింపవలసివచ్చినచోఁ బ్రాణ దానము నే చేయవలయును.” అమరత్వము నాపాదించుసనాతన

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/71&oldid=350627" నుండి వెలికితీశారు