పుట:ASHOKUDU.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

అ శో కుఁ డు

ధర్మమిదియే. మృత్యు మధ్యమునుండి యే యమృతమును బొందుట-భోగమునందు లభియింపనిది కూడఁ ద్యాగము నందు లభియింపఁగలదు. --సంభోగమున లేనిసుఖము సంయమనమునందున్నది. విలాసమున దుర్లభమైన యానందము విరాగమున సులభమైయున్నది. కాని యీ సంగతి యందఱు నెఱుంగరు. ఎఱింగినను గ్రహియింపఁ గలిగినవారు కొంతమంది మాత్రమే-గ్రహించినను విశ్వాసముతోఁ బని చేయువారు చాలఁదక్కువగా నుందురు.

రాజభోగములును, విలాసవిభ్రమములును నపరిమితము లే యైయున్నను వానియం దశోకునకుఁ దృప్తికలుగ లేదు, ఆతని హృదయము విలాససుఖంబులఁ దేలియాడుచున్నను విచారించుచు నే యుండెను. ఆ కారణము చేత నే యాతఁడు తన ప్రాణములను బౌద్ధధర్మములకుఁ బూజోపహారములుగఁ జేసి వైచెను. అందువలన నప్పుడాతనికి నవజీవనలాభము కలిగెను.

ఆనవజీవనమునం దాతఁడు నవనవజ్యోత్స్నాంత రాళమున నవనవాదర్శములం జూడఁగలిగెను. ఆతనికప్పుడు కర్తవ్యము బోధపడి యెను. ఆనూత్న విజ్ఞాన తేజస్సాహయ్యము చే నాతఁడు ముందుగఁ దనగృహమున సంస్కరణమున కారంభించెను. జీవునకుఁ బ్రేమసంయోగము లభించినది. నిరంతరముఁ ద నయాహారమునకై య నేకములగు మృగములును బక్షులును సంహరింపఁబడుచుండుట నాతఁడు కనుంగొనియెను, ఉదరపో

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/72&oldid=334274" నుండి వెలికితీశారు