పుట:ASHOKUDU.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేనవ ప్రకరణము

53

కొందఱు రాజమహిషులును నగరమునందలి ప్రతిహింసాపరాయణులును బలవంతులు నగుకొందఱుజనులునుమాత్రము గాక తక్కినజనసామాన్యమంతయు బిందుసారునిమాటయు, యువరాజగుసుషీముఁ డు మొదలగునితర భ్రాతృవరులహత్యలును, రాధాగుప్తుని కౌటిల్య చరిత్రమునుగూడ సంపూర్ణముగ మఱచిపోయిరి. సాధారణజనులు తమతమ వ్యాపారములు క్రమముగ జరుగుటయే చూచుకొనువారు కావున వారికీయాలోచనయే లేదు. వారి సదుపాయములకు లోపము లేకుండ నున్నప్పుడే రాజ్యము నేరాజు పాలించిన వారి కేమి? న్యాయాన్యాయ విచారణ చర్చయు బ్రతిహింసాచరణాలోచనయు జాలకాలము వఱకు వారి హృదయములయందు మెఱయుచుయుండెను; కాని నాలుగు సంవత్సరములు భయంకరముగ శోణిత వాహినులు ప్రవహించినతరువాత వారికి మరలా మంచి కాలము వచ్చినది. ఇప్పు డా రాజ్యమునందలి ప్రజ లందఱును ముక్తకంఠులై కౌముదీపులకితంబగు నారాత్రియందు విమలచంద్రికానగరమునందుఁడి యుచ్చైస్వరమున నీవిధముగ సాధువాదము లంగావించు చుండిరి - "జయమగుఁగాక మహారా జశోకునకు జయమగుఁ గాక ! " రాజమందిరము, నందును, సమున్నత ప్రాసాదములయందును, ప్రకోష్ఠములు యందును, మందిరముల యందును, మఠములయందునుగూడ. నావిజయనాదము లే ప్రతిధ్వనించు చుండెను"——" జయమగుఁగాక ! మహారాజగునశోకునకు జయమగుఁగాక !"——

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/61&oldid=333852" నుండి వెలికితీశారు