పుట:ASHOKUDU.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

అ శో కుఁ డు

అది జ్యేష్ఠమాసము; శుక్ల పక్షము; పంచమితిధి - సార్వ భౌముఁడగున శోకునిపట్టాభిషేక క్రియలు సర్వము:ను సంపన్నంబు లయ్యెను.


పదునాఱవ ప్రకరణము

దిగ్విజయము.

సార్వభౌముఁడగు నశోకుని ప్ర తాపము దశదిశాపరి వ్యాప్తమయ్యెను. సమస్తసామంత మహీపాలురు నాతని సార్వభౌమత్వము నంగీకరించిరి. అతని బాహుబలపరాక్రమము లందఱకును బరిచితము లయ్యెను. ఆతని చతురంగబలములు దినదిన ప్రవర్ధమానము లగుచుండెను. వారు కేవలము రాజ్యము శాంతిరక్షణము గావించుట చేతనే తృప్తి వహించియుండుట లేదు. పశుబలము ధర్మబలము చే నియమితమును సంయతమును గాకు న్నచో నది క్రమముగ ధర్మబలమును మించి యతి క్రూరముగఁ బరిణమింపఁగలదు. సేనా నాయకు లాసంగతిని బాగుగ గ్రహించి యడిరి. మంత్రిగణముకూడ గ్రహించియుండెను. ఇప్పటికి నాలుగుసంవత్సరములనుండి మహారాజు యుద్ధవిద్రోహములలో నే మునింగియుండెను. శాంతిని వహించి యెంతయో కాలము కాలేదు. ఇప్పుడు మరల దిగ్విజయార్థమై యుద్ధయాత్ర చేయవలయు ననిన సైనికులకుఁ గష్టముగ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/62&oldid=350121" నుండి వెలికితీశారు