పుట:ASHOKUDU.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియేడవ ప్రకరణము


ప్రజావస్థ

భారతవర్షము చిరకాలమునుండి విశేషించి పల్లెలే ప్రధానముగాఁ గల దేశము. ఇప్పటి బ్రిటిషు భారతవర్షమున నిన్ని నగరములు, నుపనగరములు గలిగి నాగరిక సంఖ్య యతిశయించి యున్నను జాలభాగము పల్లెలుగా నుండుటయే కాక జనసంఘమునం దధికాంశజనులు పల్లెలయందే యున్నాదు. అశోకుని రాజ్య కాలమునఁ బల్లీ సమాజమే ప్రధానముగా నుండెను పల్లెలయందలి శ్యామల శోభామధ్యమున నన్న వస్త్రములకును జలమునకును బాధ లేకుండ నాఁకలిదప్పి,కలనుమాట యెఱుంగక శీతాతప బాధలకు లోఁబడక స్వస్థచిత్తులై యారోగ్యవంతులై ప్రజ లెల్లరును దమతమకష్ట సుఖంబుల నను భవించుచుఁ గాలము గడుపుకొనుచుండిరి. మాటి మాటికిని వారు తమలోఁదాము కలహించి రాజద్వారమునకుఁ దగవుల కై పోవుట లేదు. పల్లెటూరివారందఱును. దామెన్నుకోనిన యొక పెద్దమనుష్యుని మూలమునఁ దమ తగవులను దీర్చుకొనుచుఁ డిరి. గ్రామమునందలి ప్రజలందఱును దమచిన్న పెద్దతగవుల నా పెద్దకే నివేదించుచుండిరి. ప్రజలందఱును సంఘమునకు భయపడుచుండిరి. దేశము