పుట:ADIDAMU-SURAKAVI.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

ఆడిదము సూరకవి.


కావ్యరచనా విషయమున నూతన మార్గమును జూపు రా మలింగేశ శతకమును వ్రాసి' వన్నె కెక్కెను. పూర్వ కవుల యెడలఁ దనకుఁగల గౌరవమును, తన బుద్ధి స్వాతంత్యమును నితడు, కవిత్వమర్యాదల యందు, కార్యనిర్మాణము నందును వెల్లడించియున్నాఁడు. సూరకవి సమకాలికులచేఁ జెప్పఁబడినది గా వాడుకలోనున్న యింక్రింది పద్యమున, నతనికి నాంధ్రసా రస్వతమునఁగల యున్న తస్థానమును నిరూపించుటకుఁగా నుదా హరించి ధన్యవాదములం జేయుచు నీ మహనీయుని పవిత్రచరి తమును నింతటితో ముగించు చున్నాఁడను.


ఉ. ఆధునికుల్ కవీంద్రులు స • హస్రము లుందురుగాక నీవలెన్ మాధురిగల్గు నేకవన • మార్గము తిక్కనసోమయాజి శ్రీ నాధుఁడు ముక్కు తిమ్మకవి • నాఁడు ప్రసిద్ధులుగాకిటీవలన్ గాధితమయ్యె నీవలనఁ • గాదె కవిత్వము సూరసత్కవీ.

సంపూర్ణము

COMPOSED BY V. JAGANNADHAN:-S. V. V. Press, VIZAINAGRAM.