పుట:ADIDAMU-SURAKAVI.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము.

137



పొడసూప 'మొదలు పెట్టెను. ఆ సమయమున నే సూరకవి గ్రంథ రచన కారంభించెను. పెద్దనగారి యుత్పలమాలిక యందలి విష యముల నతఁడు చక్కగఁ బరిశీలించెనని మాకుటుంబమునందు నిలిచి యున్న సూరకవిగారి నాఁటి తాళపత గ్రంథములను బరీక్షించినఁ దెలియఁగలదు. నన్నయ తిక్కనాదుల కవిత్వమునం దాతనిఁకిగల గౌరవమత్యధికము, 'పెద్దనామాత్యుని శ్రావ్య తాపక్ష పాత మతము నతఁడవలబింపక నన్నయాదుల మార్గ మునే ప్రశస్తమని యెన్ని నట్టులు సూరకవిదియగు నీకిందిపద్య మువలన విశదమగుచున్నది.


<సీ. యతి, యుక్త వా • క్యానుగతి నంటవలయు వ
త్సంబు ధేనువు వెంటఁ • దవిలినట్లు
మెట్టుమీఁదను గాలు • పెట్టఁగై దండ యం
దిచ్చినట్టులు పాస • మెనయవలయు
సానఁబట్టినమణి • చందానఁబద మధ్య
నారీశుభంగి బం - థంబువలయు
దివి వెలుంగు మెఱుంగుఁ • దీఁగెయట్లర్థంబు
తేట తెల్లంబుగాఁ • తెలియ వలయు


గీ. నలఁతి తొలపడ్డచంద్రమం • డలమువలన
జలజలను రాలు నమృతంపు • జాలులీల
రసము తులకింపవలె నట్టి • రమ్యకవిత
రసిక రస నారిరంస చే • బ్రబలకు న్నె.


ఇట్టి యాదర్శమును దన ముందిడుకొని కవిత్వము చెప్పిన వాఁడగుటచేత . సూరకవి కవిత్వము సత్కవి సమాదరణీయమై