పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
38

దా స భా ర తి

   మొదట దేవుని యున్కి నీ భూజనముల
   కందఱికి నెద్ది చెల్పెనో యట్టి బరత
   ఖండమున జెట్టువచ్చెడ్లు కాలమునకు
   మరుగు సిలదెలవలె నిప్డు పుట్టె జనము

53. మాంసాశన నిరాసము :

గీ॥ ఆయురారోగ్యకరములై యతిశయిల్లి
     పాలు చక్కెర దాన్యముల్ ఫలము లుండ
     జంతువులబట్టి తిననేల జాతిమాలి
     జ్ఞానవంతుల మనుకొను మానవులకు.

54. సత్యదౌర్గత్యము :

సీ॥ ధనముల నాశించి తగని నేరము చెప్పు
          వర్తకు నోటికి పడకీపడకి
     దీనుల కొంపలు దీసెడు ప్లీడరు
          కూటసాక్ష్యంబుల గుందికుంది
    మిగుల లంచము మేసి నిగిడెడు నుద్యోగి
         కలమున గన్నీరు గర్చికార్చి
   సోమరిపోతులై సోదెలు పల్కెడి
         మతగురువుల చెంత మాడిమాడి
  యెట్టులుంటిని చెప్పుమా యెల్ల ఏద
   నరములం బొల్పు రాయంచ సాధిమైత్రి
  గడపు చుక్కాని: సత్కులాంగనల సొమ్మ!
  మప్రతమ్ముల ముఖ్యమ్మనూనృతమ్మ!