పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

87

క చ్చ పీ శ్రు తు లు

11. హరిశ్చంద్రోపాఖ్యానము

విద్యాగర్వము

గీ॥ తా నెఱుంగుదు ననెడు విద్యలకు మేర
      యల దిగంతపురేఖ హద్దట్లు తోచు
      గాన సంపూర్ణ పాండిత్య మూనితి నని
      యులికి సభ నాడుటలు పిచ్చికళలు గావె

ధనలోభదంభము:

మ॥ధనభోగంబుల యాశచే బొడము నీ తత్వప్రబోధంబు లీ
      వినయంబు, ల్మడిపంచెలుం, గరిముల న్వ్రేలాడు మాలబ్రొనం
     టను నామంబులు, చేత బొత్తములు కంఠంబందు రుద్రాక్షలున్
     ధనవాంచ న్విడనాడు వారలకు నీదంభంబు నింకేటికిన్

భరతఖండము:

సీ॥ సర్వ శ్రుతిస్మృతి శాస్త్రంబులకు మూల
            కందమై విఖ్యాతి జెందె నెద్ది
     సంతత జనతన స్వార్యాయ సత్యవ్ర
           తాపనీసురులచే వలసె నెద్ది
     స్వచ్చంద రాజ్యసంపద గల్గి పాపన
          చరితులొనృపతుల వరలె నెద్ది
    గణియించుటకు నశక్యంబైన కాలంబు
         నుండి నాగరికత నిండె నెద్ది