పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 84

చుట కుపయుక్తమగుటలేదు. కాఁబట్టి యీనిఘంటు వున్నత సాహిత్య విద్యాప్రణాళికకు తోడ్పడలేదు.

చిన్నయసూరి నిఘంటువు

పై నిఘంటువులలోని లోపములన్నియు గమనించి ఆంధ్రవ్యాకరణ లక్షణమునకు లక్ష్యముగ నుండునట్లుగను, రూపనిష్పత్తులనుగూర్చి స్పష్టమైన పరిజ్ఞానము కలుగుటకును, ఒకే పదమునకు సందర్భము ననుసరించి యేర్పడుచుండు నర్థచ్ఛాయలు విదితమగునట్లుగను నొక నిఘంటువును చిన్నయసూరి వ్రాయ నుద్యమించెను. దానికొఱ కాతఁడు వాఙ్మయమున ప్రామాణికులగు మహాకవుల కావ్యములను పఠించి తానే స్వయముగా నందలి పదములను తీసి వ్రాసుకొనెడి వాఁడు. ఆ కాలమునం దిప్పటివలె నచ్చుపుస్తకములు విశేషముగ లేవు. కేవలము తాళపత్ర ప్రతులను పరిశీలించి చిన్నయసూరి పరిశ్రమ చేయవలసివచ్చెను. ఈ సందర్భమున నాతఁడు చేసిన పరిశ్రమ యనితర దుర్గ్రాహ్యమని చెప్పనొప్పును. తాను చూచిన ప్రతి పదమును బాగుగా విమర్శించి చూచుకొను బాధ్యత చిన్నయసూరియం దుండుటచే నాతని నిఘంటువు కొంతవఱకు సాగినను అతని జీవితకాలములో సంపూర్తి కాలేక నిల్చినది. పైని వివరించినట్లుగా నిందు తెనుఁగు - పదములకే ప్రాధాన్య మియ్యఁబడియున్నది. కొలఁదిగా సంస్కృత పదములుకూడ కలవు. ఈ నిఘంటువు నేడు సంపుటములలో సూరి స్వయముగా వ్రాసియున్నాఁడు. ఇది