పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 83

1. తెనుఁగుపదములకు తెనుఁగర్థములే కాక ఇంగ్లీషు భాషలో నర్థము లియ్యఁబడినవి.

2. పదములకు ఆ యా గ్రంథములనుండి ప్రయోగములు సేకరింపఁబడి యుదాహృతములైనవి.

3. ఆశ్వాస సంఖ్యయు, పద్యసంఖ్యయుకూడ నీయఁబడి యున్నవి.

4. ఈ నిఘంటువుతోకూడ అన్యభాషాపదము లగు హిందుస్థానీ ఫారసీ యింగ్లీషు తమిళము మహారాష్ట్రములకు సంబంధించినపదములుకూడ "మిశ్ర నిఘంటువు" అనుపేర రచితమైనది.

5. ఈ గ్రంథమున కొక యమూల్యమగు పీఠికకూడ చేర్పఁబడియున్నది. అందు కొంతమంది కవులనుగూర్చి, కావ్యములనుగూర్చి విశేషములు తెలుపఁబడినవి. ఇ ట్లున్నను ఈ నిఘంటువునందు గ్రాంథిక పద్ధతికి ననుకూలమగు రచన లేదు. ఇందు శకటరేఫములుగాని, అర్ధానుస్వారములుగాని పాటింపఁబడలేదు. దంత్యతాలవ్యములు - అనఁగా "చ చ", "జ జ" లు వేఱు వేఱుగా చూపఁబడక ఆ యా వర్గములయందే చూపఁబడినవి. దీనివలన ప్రాచీన కావ్య సంస్కరణమునకు వలయు పదములయొక్క సరియగు రూపములను తెలిసికొనుటకు, పాఠభేదములు గ్రహించుటకు మాత్రమే వీలగుచున్నది కాని వ్యాకరణ సంప్రదాయములను, ప్రయోగ విశిష్టతను గ్రహిం