పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. పాండిత్యప్రకర్ష - ఉద్యోగ ప్రయత్నములు

కాలక్రమమున సహజ మగు ప్రతిభాసంపత్తికిఁ దోడుగా హయగ్రీవమంత్రబలముగూడ ననుకూల మగుటచేత ముప్పదేండ్లు వచ్చుసరికి చిన్నయ సంస్కృతాంధ్రద్రవిడము లను మూఁడుభాషలయందు కూలంకషమగు పాండిత్యమును సంపాదించెను. కేవలము లక్షణగ్రంథములగు వ్యాకరణాదిశాస్త్రముల యందు పరిశ్రమఁజేసి లక్ష్యపరిజ్ఞానము నెఱుఁగని కొంతమంది లౌకికపండితులవలెఁగాక చిన్నయసూరి సిద్ధాంతకౌముది నామూలాగ్రముగా నాకళించినవాఁడయ్యు దానికి లక్ష్యములగు సంస్కృతకావ్యపఠనమునుగూడ సంపూర్తిఁ గావించినవాఁడు. తెనుఁగుభాషలో నారీతిగనే లక్షణగ్రంథములగు నాంధ్రశబ్ద చింతామణి, యథర్వణకారికావళి, అప్పకవీయము మున్నగు వానిని చక్కఁగ పరిశీలించుటయేకాక భాషయందు ప్రామాణికములైన నన్నయతిక్కనాది మహాకవుల కావ్యలక్ష్యగ్రంథములను పైవానితో సమీచీనముగా సమన్వయముఁ గావించుచు వచ్చెను. వ్యాకరణసూత్రములకును, ప్రామాణికకవి ప్రయోగమునకును నైక్యభావము సమకూర్చుట వ్యాకరణరచనకుఁ బునాదివంటిది. ఈ సమన్వయపద్ధతిని తొలినుండియు