పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 19.

గ్రహించినవాఁ డగుటచేతనే చిన్నయ తరువాతికాలమున బాలవ్యాకరణమువంటి ప్రశస్తగ్రంథమును నిర్మించుటకు సమర్థుఁడైనాఁడు.

ఆంగ్ల భాషాభ్యాసము

ఆకాలమున నాంగ్లేయభాషయందే వ్యవహరించు రాజకీయోద్యోగులకు తెనుఁగుదేశమునఁ దెనుఁగుభాష నేర్చుకొన వలసిన యావశ్యకత యేర్పడినది. వారికి తెనుఁగు నేర్పెడు పండితునికి నారీతిగనే యాంగ్లేయభాషాపరిజ్ఞాన మావశ్యకమైనది. అయినను మన తెనుఁగుపండితులు సంస్కృతముఁ జదువుకొనెనను ఛాందసులగుటచే పాశ్చాత్యభాషయగు నాంగ్లేయభాషను నేర్చుకొనుట కాకాలమున నెంతమాత్ర మంగీకరింపరైరి. కొందఱు దానిని మ్లేచ్ఛభాష యని గర్హించిరి. కాని చిన్నయసూరి లోకజ్ఞుఁ డగుటఁజేసి దేశకాలపరిస్థితుల గమనించి తాను గొప్ప సంస్కృతపండితుండయ్యు నాంగ్లేయభాషను నేర్చెను. ఈవిధముగా నాంగ్లభాషాప్రాముఖ్యమును గుర్తించు టాతని నవీనదృక్పథమున కొక తార్కాణము. ఈ భాషాపరిచయముతో కంపెనీవారి ప్రభుత్వమునం దుండు నున్నతోద్యోగులతో స్నేహభావమును బెంపొందించుకొని చిన్నయసూరి వారి యనుగ్రహమునకుఁ బాత్రుఁడై నాఁడు. ఇంతియేకాక యీనాఁటి కొంతమంది రచయితలవలె తమ కేదో భాషాజ్ఞానము కలుగఁగానే గ్రంథరచన కుపక్రమించు