పుట:2015.396258.Vyasavali.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
52

వ్యాసావళి

"పొలమేర" అనే ఉన్నది. (చూ.ఎపి.ఇండి. IV. 834) నేనెరిగినంతమట్టుకు ప్రాచీనులవ్రాతలలో ఎక్కడా "పొలిమేర" కానరాదు. కన్నడ భాషనున్న ప్రాచీన శాసనములలోకూడా "పొలసీమే అకారాకారా యుక్తముగానే పొలశబ్దము కనబడుచున్నది. (చూ.ఎపి.ఇండి.X 66) కిటిల్ రచించిన కన్నడ నిఘంటువులో పొలశబ్దమునకు, దిక్కు అనేఅర్దము కూడా ఉన్నది. కన్నడశబ్దము ప్రధానప్రమాణమని చెప్పలేదుసుమండీ.

      శాసనములు రాగిపట్టాలమీదను రాతిపలకల మీదను ఏలాగున మొదటచెక్కినారో అలాగుననే ఉన్నవి. తాటాకుపుస్తకములు అట్టివి కావు. మొదట వ్రాస్దినవి నశించినవి. ఇప్పుడు మనకుదొరికేవాటిలో అనెకము మన తండ్రితాతల తరమున వ్రాసినవి. ప్రతినిచూచిప్రతివ్రాస్తూ లేకనలు గ్రంధమునశించకుండా కాపాడేవారు. అయితే గ్రంధము నిలుచుటకు ఇది అనుకూలించినా గ్రంధములో అల్పముగానో అధికముగానో మార్పులు గలుగుటకు కారణమయినది. శాసనములలోని భాష  యధాస్దితిగా ఉండుటబట్టి విచక్షణులయినవారు శబ్దములరూపములు అర్దములు ఏకాలమం దెట్లున్నదో తెలిసికొనుటకున్న గ్రంధకర్తల భాషయొక్క సాధుత్వాసాధుత్వములు విమర్శించుటకున్న లేఖకులభ్రమప్రమాదములవల్ల కలిగిన మార్పులు కనుగొనుటయన్న తాటాకుపుస్తములకన్నశాసన ములు ఎక్కువ అనుకూలముగా ఉంటవి. తాటాకు పుస్తకములయినా, మెలకువతో పండితులు మాతృక లోఉన్నట్టు వ్రాసినవైతే  ఇంచుమించుగా నిర్దుష్టమని నమ్మదగిఉంటవి. అట్టివి రెండుమూడు చూచినాను. అటువంటి ప్రతులు ప్రాచీనగ్రంధములకు దొరికితే, అమూల్యములని భావించవలసినవి. దొరకనప్పుడు ఎవరేమి చేయగలరు? శాసనములున్ను తాటాకు పుస్తకములున్న సంప్రతించి వివేకముతో విమర్శనముచేసి, భాషాతత్త్వజిజ్ఞాసువులు అవలంబించిన అన్వేషణక్రమానుసారముగా కంటికి కనబడుతూఉన్న సిద్ధశబ్దములు