పుట:2015.396258.Vyasavali.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

53

రాజరాజ కాలమందున్న తెనుగుభాష.

లక్ష్యముగా గ్రహించి వాటికి బాధకముగా కాకుండా లక్షణము నిరూపించదమన్న అవశ్యమయితే లక్షణము మార్చడమున్ను పంతులవారివంటి పండితులకు విహితధర్మము; ఆవిమర్శపూర్వకమ యిన సిద్దాంతమునకు విరుద్ధముగానున్న శబ్దములు ఆసిద్ధాంతానురోధముగా మార్చివేయుట నింద్యమయి నపని. నన్నయ స్వయముగా వ్రాసినవ్రాత ఎదుట నుంచుకొని (నన్నయ సమక్షమందు) రాగిరేకుమీద గండాచార్యుడు యధాస్దితిగా శాసనముచెక్కినట్టు శానమందే ఉన్నదిగదా. దీనిలోనిభాష నన్నయకాల మందున్న తెనుగనుటకు ఇంతకన్న విశ్వసనీయమ యిన ప్రమాణము ఏది సంభావ్యమో నాకుతోచదు. శాసనమే కూటకరణమైతే నిరాకరించవచ్చును; కాదని నమ్మవలసివచ్చినప్పుడు బరమప్రమాణమే . నన్నయ కాలమందున్న అతనితర్వాతను శ్రీనాధుని కాలమువర కున్ను శాసనస్దమై "పొలగరును" "పొలమేర" శబ్దము లున్నవిగనుక ఆకాలమందు ఆశబ్దము అట్టిరూపమున ఉన్నదని ప్రాచీనాంధ్రభాషా శబ్దానుశాసనమున్ను అర్వాచీనుల వ్యవహారమందు "పొలిమేర" అనేరూపమున్నందున దాని! అనురొధముగా అర్వాచీనాంధ్రశబ్దానుశాసనమున్ను చేయుట పాణిన్యాదిశబ్దానుశాసనల సంప్రదాయము. వేదములలోనున్న భాషకున్ను నాటితర్వాత పుట్టిన ఇతిహాసములు, పురాణములు, ధర్మశాస్త్రములు మొదలయిన గ్రంధములలో కానరాక వేదములొ మాత్రమేఉన్న శబ్దములు ప్రాచీనములవుటచేని వాటికి వేరే అనుశాసన మేర్పడినది. కోశమందున్ను వ్యాకరణమందున్ను వీటిలక్షణము యధాస్దితిగా నిరూపితమయిఉన్నది. ఇట్లేఇంగ్లీషుభాషాశబ్దాను శాసనము ద్వివిధముగా ఉన్నది. ప్రాచీనమయిన ఇంగ్లీషుశబ్దముల లక్షణము కోశమందున్న వ్యాకరణమందున్ను ఇంగ్లీషుపండితులు నిరూపించి ఉన్నారు. ఆప్రకారము తెలుగుబాషాపండితులు ప్రాచీనాంధ్రశబ్దలక్షణము నిరూపించద