పుట:2015.396258.Vyasavali.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కా ర నిరసనను 28 లోకులకు అపరిచితమయిన భాషలోనికి మార్చడము యుక్తమా? ఇట్టి దురా వారము మరేదేశమందున్న లేదు. (గాంథిక భాషలో నే పూర్వులంకూడా కథలు రచించేవారని తోచునట్లుగా ఇప్పటి అచ్చు పుస్తకాలు దుష్టపరిష్క ర్తల కూటకరణమువల్ల మారురూపము పొందినవి. వాడుక భాషలోని కథలు పిల్లల స్వంతసారస్వతము; పొమరుల స్వత్వము, సర్వజన సామాన్య సంపత్తి, వాడుకలో లేని భాషలోనికి వీటిని మార్చడవు మహాపాతక ము. ఇట్టి పాపకృత్యము పూర్వపండితులు ఎన్నడూ తల పెట్ట లేదు. అచ్చు యంత్రములో మొట్ట మొదట అచ్చు పడ్డ తెలుగు పుస్తక ములు చూచినవారికి నిజము తెలుస్తుంది. ద్వాత్రింశత్సాలభంజికకథలు 1819వ సంవ, పంచ తంత్రక ధలు 1884వ సం.న చెన్న పట్టణ పాఠశాలలో అప్పుడు తెలుగు పండితుడుగా ఉండిన రావిపాటి గురుమూర్తిశాస్త్రిగారు వ్యావహారిక భాషలో రచించి అచ్చు వేయించినారు. ఆయన తెలుగు వ్యాకరణము, శేషయ్యగారి తెలుగు వ్యాకరణమువంటి గ్రంథములు కూడా అట్టి భాషలో నే రచితమై ఉన్నందున ఆ కాలమందు అట్టి రచన సత్సంప్రదాయానుసార మయినదని ఊహించవలెను. చిత్రకథలు, నీతికథలు (1856), నారాయణ సామిగారి తెలుగు కథలు (1839), పరమానందయకథలు (1861) మొద లయినవి అప్లై వాడుక భాషలో నే అచ్చు పడ్డవి. అంతకు పూర్వముకూడా ఇట్లు కథలు రచించుట శిష్టాచారముగా ఉండేదా అని విచారించగా, ఆంధ్ర సాహిత్య పరిషత్పస్తక భాండాగారమందు వ్యావహారిక భాషలో రచిత మయినక థలం తాటాకుపు సకాలలో చాలా కనబడ్డవి. ఉదా: చిలుక చెప్పీనకథలు, హంసవింశతి, ద్వాత్రింశతాలభంజికలకథలు, పంచతంత్ర కథలు, 'తెనాలిరాముడికథలు మొదలయిన వే "కాక, రామాయణము, భాగ వతము, భారతము మొదలయినపురాణేతిహాసములు కూడా ఇట్టిభాషనే వచ నములూ కథలుగా గచితమయినవి ఉన్న వి. ( రామాయణార్థంబు అందరికీ