పుట:2015.396258.Vyasavali.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
88

వ్యాసావళి

  మాదృష్టిలో ఇదే వాస్తవమైన భాషాభిమానము* మా ఉద్దేశము కొనసాగితే, పెద్దమనుష్యులు వ్రాసే సభ్యభాష దేశమంతా క్రమకమముగా వ్యాపించి విద్యాబోధనకు కావలసిన సులభసాధన మేర్పడుతుండి. పామరులకు సులభమైన వాజ్మయము పుట్టుంది. వక్తలకూ వాచకులకూ తగినభాష కుదురుతుంది. మనము ఇంగ్లీషు నేర్చుకొని వ్రాస్తూన్నట్టే మనదేశమందు కాపురమున్న ఇంగ్లీషువారున్ను ఇతరులున్ను మనభాష నేర్చుకొని మనభాషలోనే వ్రాసిగాని నోటకు చెప్పిగాని మనకు హితోపదేశము చేయవచ్చును. భాషలో ఐక్యమువల్ల దేశమునకు రాష్ట్రమునము ఎంతబలము కలుగునో చరిత్ర చదివినవారికీ రాష్ట్రము ఏలేవారికి తెలుసును. వాడుకలో ఉన్న భాషపట్ల కలిగే ఇన్ని లాబములు విడిచి, వాడుకలో లెనిదీ, కొద్దిమంది పండితులకు మాత్రమే సాధ్యమయినదీ, ప్రాచీనభాష వ్రాతలలో వాడడము వ్యర్దప్రయాసము కాదా? ఈ ఆచారము ఏదేశములోనూ లేదు; మనదేశమందయినా పూర్వము లేదు. మన తాతల నాడు లేదు. మనతండ్రులనాడు లేదు. ఈ ఒక్కతరములోనే ఈవైపరీత్యము, ఈ ఉత్పాతము పుట్టినది. ఈ విషయము ముందు ముందు మేము విపులముగా చర్చించ  దలచుకొన్నదే; గాని ఇక్కడ సూచనగా మాత్రము చెప్పినాను.
    పత్రికలుగాని, పుస్తకములు గానీ, వ్రాసేవారి ముఖ్యొద్దేశ మేమి? నోట మాట్లాడే వారి ఉద్దేశమే: తమ అభిప్రాయములు ఇతరులకు తెలియ జేయుదము. మాట్లాడుపదము తమ ఎదుటనున్న వారికోసము. వ్రాయడము దూరముగానున్న వారి కోసము. ఎవరి మట్టుకు వారు జ్ఞాపకముగా వ్రాసి

__________________________________

   *వాడుకలోనున్న భాషను తృణీకరించి ప్రాచీనభాషను బ్రతికియున్నవారికి తిండిపెట్ట: చచ్చిన వారికోసము సంతర్పణ చేసినట్టుగాదా? ఆదికవులకు అట్టి దురభిమానముంటే తెలుగులో గ్రంధములే లేక పోవునుగదా? మనపూర్వుల యెడల యెట్టిగౌరవ ముండవలెనో అట్టి గౌరచమే ప్రాచీనాంధ్రము సారస్వతముపట్ల ఉండవలెను. మాకు వాటియెడల చాలా భక్తికలదని వాటికి మేము చేసే ఉపకారమును బట్టి లోకులు తెలుసుకోగలరు.