పుట:2015.394455.Gajendramokshana-Rahasyardhamu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞప్తి

వైరాగ్య పుష్పగుచ్ఛము — భగవద్గీతా దండకము గీతా ప్రశ్నోత్తరములు — రామగీతార్ధము — బూ దెల వేదాంతాది గ్రంధములు — రచియించుటకు ముందుగ నేనీ గజేంద్ర మోక్షణమను చరిత్రమునకు, బాహ్య — రహస్య లేక నధ్యాత్మిక తాత్పర్యములు విశేషముగా వ్రాయుటలో శ్రుతి స్మృతులు సందర్భానుసార ముపయోగించి సృష్టిక్రమముఁ — గాముకుని లక్షణములుఁ - దత్కామజనిత కష్టములు — వాటినివారణోపాయములు — మున్నగునవి. యెల్లరకు బోధపడునటులు, పూర్వపక్ష సిద్దాంతములతో సమకూర్చడమైనది. పాలయందు వెన్నగలదనియు నయ్యది నెయ్యిగా మారగలదనియు నందఱకుఁ దెలిసిన విషయమే, కాని, సక్రమముగాఁ దీసిననే యదివచ్చునుగాని లేనినాడది చెడిపోవునటులనే, ఈ గ్రంధముఁ జక్కగాఁ జదివిన వారికే బోధపడగలదని వేఱే చెప్పనక్కరలేదు. అదిగాకఁ జందోవ్యాకరణాదు లంతగాఁ దెలిసినవాఁడను గాను గాన నిందేవైనఁబొరపాటు లగుపడిన నవి నాకుఁదెలియపర్చినచో సవరించుకొందును అంతియేగాక నచ్చటచ్చట నద్వైతమునుగూర్చి నే నుపన్యాసము లిచ్చుచుండుటలోఁబూళ్ళగ్రామము వారీ పుస్తకమచ్చు గూర్పింపఁబ్రోత్సహించి కొంతధన సహాయమొనర్చి రాతదుపరిఁబాలకొల్లు రామలింగేశ్వరస్వామి వారి దేవాలయములో గీతోపన్యాసము లొసంగుచుఁ బ్రస్తావనలోఁ బై గ్రంధమునుగూర్చి ముచ్చటింపఁ తెనాలి తాలూకా వరహాపురం అగ్రహారం వాస్తవ్యులున — ప్రస్తుతము నర్సాపురం తాలూకా దిగమఱ్ఱి గ్రామము