పుట:2015.393685.Umar-Kayyam.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ఉమర్ ఖయ్యామ్

91

నీచకాలంబ ! నీచాతి నీచరక్ష
యీ వెవనికైన మేలు గావించినావె
ఘనులఁ గూళలఁ, గూళల ఘనులఁ జేయు
దిదియె కలకాల మరయ ప్రాయకము నీకు.

92

ఓ కాలంబ ! భవత్పరిభ్రమణ నా కుత్సాహమున్ గూర్పులే
దాకాంక్షన్ నను వీడు ; పట్టుకొన నే నర్హుండనే ? యారయన్
నీకున్ నీచు లవజ్ఞు లాప్తులు గదా నేనే మనల్పుండనా
నాకేమైనఁ ద్రికాలవేద్యమగు జ్ఞానం బున్నదా చెప్పుమా.

93

ఓ కాలంబ ! సతంబు నా కహితవై యున్నావు నీ వన్యులన్
సాకల్యంబుగ సాకుచుందువు ; ననున్ సాధింతు వీవెవ్డునా
కైకయ్యానికి రానిమాటయును, నీకై నేనొగిన్ సంధికై
రాకేపోవనిమాట యెన్నఁడయినన్ రాజిల్లనే చెప్పుమా.

94

నా కీకాలముపై స్వతంత్రయె యున్నన్ దీనిఁ బోద్రోసి యిం
కోకాలంబు సృజించియుందు ; నట స్వేచ్ఛోద్దేశస్వాతంత్ర్య భా
వై కారంభుల యీప్సితార్థతతు లత్యంతంబు నీడేర, న
స్తోకప్రక్రియ జీవితాళి గడవన్ దోడై విరాజిల్లఁగన్.