పుట:2015.393685.Umar-Kayyam.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

25

95

ఈతమసావృతంబయిన హీనవుఁగాలము మాకొనర్చు హిం
సా తతి, నీచు లల్పులను సాకుటకై పడుపాట్లుఁ జూచి నా
చేతము రక్తకుంభమయి చిమ్మఁగ నశ్రువు లాస్యమండలం
బాతతవారిపాత్ర మయి యార్తి ఘటించెడు నెల్ల కాలమున్.

96

బోర్ల వేసినపాత్రను బోలె నభము
కాలరూపంబు సూచించు ; ఘనులనందు
దుస్థ్సితిని బడఁద్రోసి ముద్దుల నొసంగు
కలశరసములవలె మైత్రి గలదు గాని
యందు నెత్తురు నిండి పొంగారుచుండు.

97

వీరుఁడు "రుస్తు" మున్న తన వీటిని గాఁపురమంచుఁ జెప్పరో
క్రూరపుఁగాలమా ! సతము కూళల కే కడుఁగూర్తువీవు పెన్
ధీరులనే యడంతుగగె ! నీ విఁక ముత్యమొ చిల్ల పెంకువో
దూఱక చెప్పు నీ దురిత దుస్సహచేష్టల కీవె సాక్షివై.

98

లోకదుఃఖము - మధువు

ఓచెలీ ! మమ్ము మ్రింగుటకు హుమ్మని కాలము వేచియుండ నీ
పాచిజగంబు మాకొక ప్రవాసనికేతన మట్టు లున్న దం
తే చషకంబు ద్రాక్షరస మీయెడఁ గైకొన త్రావనుండ సం
కోచము పొందనేల ? యిది కూడనికార్యమె యెట్టివారికిన్.