పుట:2015.393685.Umar-Kayyam.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

11

39

ఓ నా ప్రాణపదంబా
నేనే కల నీవు లేవు నీలో నేనై,
లీనంబుఁ జెందితిని మఱి
నేనే లే నీవె కల వనిం-తలీలన్.

40

ఒకపరి నగపడ వెచ్చట
నొకపరి స్వర్గస్వరూప కోజ్జ్వలకళలన్,
బ్రకటింపఁ బడెద వొకపఠి
నకలుష దృక్ దర్శద్రష్ట వయ్యెడ వభవా.

41

ప్రతిమ వచించెఁ దన్ను నిజభక్తి భజించెడువానితోడ నో
హితుఁడ మదీయపాదముల కేటికి మ్రొక్కెద వీవెఱుంగ వా
హితుఁడు భవన్ముఖంబునఁ ద్వదీప్సితసిద్ధికి నన్నుఁజేరెనా
కతమున నీవు నన్ గొలువఁగంటివి సుమ్ము సముత్సుకంబుగా.

42

పాఠాంతరము :_
ప్రతిమ వచించెఁ దన్ను నిజభక్తి భజించెడువానితోడ నో
హితుఁడ మదీయపాదముల కేటికి మ్రొక్కెద వేనుఱాయినై
వెతఁబడి పెక్కు సమ్మెటల వేఁగి గడించితి దివ్యవ్యక్తిత
ద్గతి శ్రమపడ్డ నీపదయుగంబులు మ్రొక్కెద రెల్లవారలున్.